Supreme Court: ఎవరైనా సమాన బాధ్యత వహించాల్సిందే

నవతెలంగాణ- న్యూఢిల్లీ:  తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలైనా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ అయినా సమాన బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పతంజలి ఆయుర్వేద తప్పుదారి పట్టించే ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ మిస్‌లీడింగ్‌ అడ్వర్టైజ్‌ మెంట్స్‌ యాక్ట్‌ -2022 ప్రమాణాలను పాటించాల్సి వుందని జస్టిస్‌ హిమా కొహ్లి, జస్టిస్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మార్గదర్శకాలు 13 ప్రకారం సదరు వ్యక్తి అతను/ఆమె ఆమోదించే ఉత్పత్తి లేదా సేవపై తగినంత సమాచారం కలిగి ఉండాలని, అది మోసపూరితం కాదని నిర్థారించుకోవాలని సూచించింది. వినియోగదారుల సేవ కోసం ఈ నిబంధనలు ఉద్దేశించబడ్డాయని, మార్కెట్‌ నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తి గురించి, ముఖ్యంగా ఆహారం విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తాయని పేర్కొంది. తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ సమానంగా బాధ్యత వహిస్తారని తీర్పునిచ్చింది. వాణిజ్య ప్ర కటనలు సంబంధిత నియమాలు, కోడ్‌లకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంటూ, స్వీయ-ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయాలని ప్రసారకర్తలను (మీడియా, న్యూస్‌పేపర్‌) ఆదేశించింది.

Spread the love