సాధ్యం కానీ హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్: కాముని శ్రీనివాస్

నవతెలంగాణ – చిన్నకోడూరు 
కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని బిఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తూ, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిజెపి లకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ రద్దు చేసినట్లు మండిపడ్డారు. బిజెపి పార్టీ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపి సీట్లు సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎంపి సీటుపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నట్లు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో ఎక్కడిక్కడ ధాన్యం నిలిచిపోయిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు  గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్లు ఎల్లయ్య, శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love