కల్మషం లేని పొన్నం ప్రభాకర్ పై కారు కూతలా?

– బహుజనుల ముద్దుబిడ్డ మంత్రి అయ్యాడని ఓర్వలేక సోషల్ మీడియాలో దిగజారుడు ప్రచారాలు 

నవతెలంగాణ – చిన్నకోడూరు 
కల్మషం లేని పొన్నం ప్రభాకర్ పై ఆయన వ్యక్తిత్వంపైన అసత్య ప్రచారాలు మానుకోవాలని సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్ అన్నారు. నమ్మిన కార్యకర్తలకు అండగా నిలుస్తూ కార్యకర్తలతో ప్రేమగా ఉండే పొన్నం పైన ఇలాంటి పిచ్చి ప్రచారాలు మానుకోవాలని, అభిమానంతో స్టేజ్ పైన కార్యకర్తలను వారితో ఉన్న చనువుతో సరదాగా వ్యవహరించిన తీరుపైన ఇలాంటి ట్రోలింగ్స్ మానుకోవాలని హితవు పలికారు.పొన్నమన్న తప్పుడు చేష్టలకు పాల్పడితే ఊరుకునేది లేదు ఎవరైన సరే తగిన బుద్ది చెప్తాం అని హెచ్చరించారు.
Spread the love