భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలి: బండ శ్రీశైలం

– భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, పోరాటల అడ్డా భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగురావేయాలంటే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం మండలంలోని కొంపెల్లి  గ్రామంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గవెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు,త్రాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టు లేనని ఆయన అన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసుకోచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ కృషి చేస్తుందని, దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ద్యేయంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సిఏఏ, పౌరసత్వరద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయికరణ, ఇ.డి, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైల్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందన్నారు. నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. ఆమాట ఎక్కడికి పోయిందోనన్నారు మరోవైపు  బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే రూ.800 కోట్ల రూపాయలు బీజేపీకి పార్టీకి చేరాయన్నారు. ఈ ఎలెక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సీపీఐ(ఎం) పోరాడిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. విద్యా రంగానికి కేవలం ౦,4% మాత్రమే నిధులు కేటాయించారని విద్యను పూర్తిగా ప్రయివేటికరణ చేశారన్నారు.  ఆకలిశుచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు. లిక్కర్ కేసులో బీజేపీకి ఆరవిండో పార్మా కంపెనీ అధినేత శరత్ చంద్రారెడ్డి ద్వారా రూ.60 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నారు. నాడు వ్యాపారస్తులు వేరు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారని అన్నారు. కానీ నేడు వ్యాపారస్థులే రాజకీయ నాయకులుగా మారారన్నారు. నేటి ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఉన్న అధిపతులు పోటీ చేస్తున్నారని వారు ఇంకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో   మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు వడ్లమూడి హనుమయ్య , గ్రామ కార్యదర్శి పగిళ్ల సైదులు , కొంక రాజయ్య , ఎట్టయ్య , జీడిమెట్ల సైదులు తదితరులు ఉన్నారు.
Spread the love