మతోన్మాద బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి

– కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల హక్కులను కాలరాస్తుంది
– ఒకే జాతి ఒకే జెండా ఉండాలన్నదే బీజేపీ లక్ష్యం
– ప్రచార రధమును జండా ఊపి ప్రారంభించిన బండ
నవతెలంగాణ – మునుగోడు
మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం   మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద ప్రచార రధమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాలను కార్మికులు కర్షకులు ఒకటై బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకొస్తే, హక్కుల సాధన కోసం కొట్లాడి సాధించుకున్న హక్కులను కాల రాసేందుకు కుట్ర పన్నుతున్నా బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మండిపడ్డారు. బీజేపీకి దేశంలో ఒకే జెండా ఒకే మతం ఉండాలనే దురుద్దేశంతో ఉన్నాదని తెలిపారు.  భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు. గత పాలమెంట్ ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి,  గెలిచిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్రజెండానే అని అన్నారు. నేడు  మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, బోడంగిపర్తి, తస్కని గూడెం, చండూరు, అంగడిపేట, బంగారిగడ్డ, ధోని పాముల, నెర్మట, కొండాపురం, తెరటుపల్లి, గట్టుప్పల, వెల్మ కన్నె, కొంపెల్లి, కల్వకుంట్ల గ్రామాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, సాగర్ల మల్లేష్, వంటేపాక అయోధ్య,  యాటరాజు తదితరులు ఉన్నారు.
Spread the love