జెండా మోసినోని కంటే పార్టీలు మారినోడికే విలువలు

– ఇలాంటి స్లోగన్ వాట్సాప్ లో చక్కర్లు
నవతెలంగాణ – మద్నూర్
నేటి రాజకీయాల్లో జెండా మోసినోనికంటే పార్టీలు మారినోడికే విలువిస్తున్నట్లు వాట్సాప్ లో ఇలాంటి స్లోగన్ భారీగా చక్కర్లు కొడుతున్నాయి. అధికారమెక్కడుంటే స్వార్థం కోసం పార్టీలు మారినోడికే అధికార పార్టీ నాయకులు అధిక విలువ ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం ఏండ్ల తరబడి జెండాలు మోస్తూ పార్టీ నాయకులను గెలిపించుకుంటే అధికారంలోకి రాగానే జెండా మోసినోనికి వదిలేసి పార్టీ మారినోడికి అధిక ప్రాధాన్యతిస్తున్నారని నాయకులలో కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ, వాట్సాప్ ఫేస్బుక్ లలో షేర్ చేస్తున్నారు. పార్టీ జెండా మూసి ఎన్నికల్లో నిలబడదామంటే పార్టీ మారినోడికే అధిక ప్రాధాన్య చేస్తూ అలాంటి వారికే టికెట్లు ఇవ్వడం రాజకీయ పార్టీలలో ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్నాయి. అధికారం లేనప్పుడు ఏండ్ల తరబడి పార్టీకి కట్టుబడి ఉన్నవారికి పార్టీలో విలువ లేకుండా పోతుందని కొత్తవారిని పార్టీలో చేర్చుకుంటూ అలాంటి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం లేనప్పుడు ఏండ్ల తరబడి అధికార పార్టీ ఒత్తిళ్లకు నోచుకోని పార్టీని వదలకుండా జెండాలు మోస్తూ పార్టీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడితే, అలాంటి జెండా మోసిన కార్యకర్తకు నాయకులకు విలువలు లేకుండా పోతున్నాయని, ఇతర పార్టీల నాయకులకు పార్టీలో చేర్చుకోవడమే ప్రాధాన్యతగా పార్టీలు మారినోడికే విలువ లభిస్తుందని వాట్సప్ ఫేస్బుక్లలో స్లోగన్లు చక్కర్లు కొడుతున్నాయి. కార్యకర్తల ఆవేదన రాజకీయ నేతలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని వాట్సాప్ లో చక్కర్లు పడుతున్న స్లోగన్లే నిదర్శనంగా పార్టీకి కట్టుబడి ఉన్న వారికే విలువ ఇవ్వాలని పార్టీలు మారినోడికి విలువ ఇవ్వకూడదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం అవుతుంది.
Spread the love