అడ్డుదారి గుండా అక్రమ రవాణాలో రాత్రిపూట ఏమి జరుగుతుంది

– వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలతో పన్ను రాబట్టడం ఎక్కడ
నవతెలంగాణ – మద్నూర్
అడ్డుదారిని అడ్డుకట్ట వేయాలని పలుమార్లు నవ తెలంగాణ దినపత్రికలు ప్రచురితమైన వార్తలకు అధికారులు స్పందించినట్లు రాత్రి వేళల్లో అడ్డుదారి గుండా అక్రమ రవాణా చేసే వాహనాలకు తనిఖీలు చేస్తున్నట్లు, బుధవారం రాత్రి మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రకు అడ్డుదారి సమీపంలో వాణిజ్య పన్నుల శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు రాత్రి వేళల్లో తనిఖీల ఫోటోలను బట్టి తెలుస్తోంది. మద్నూర్ మండల కేంద్రం నుండి పెద్ద తడగూర్ రహదారి గుండా అక్రమ రవాణా జరిపే వాహనాలకు రాత్రి వేళల్లో ఏమి జరుగుతుందనేది ప్రజలకు తెలియని పరిస్థితి తనిఖీలు జరుపుతున్నట్లు, రాత్రి వేళల్లో ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలకు కనబడుతున్న దృశ్యాలు వాణిజ్య పన్నుల శాఖ అక్రమ అడ్డుదారి గుండా వెళ్లే వాహనాలకు పన్ను రాబట్టడంలో ఏమి జరుగుతుందోనని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రహదారి గుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా వందల సంఖ్యలు వాహనాలు మన రాష్ట్రం నుండి మహారాష్ట్రలోకి అక్కడి నుండి మన రాష్ట్రంలోకి అడ్డుదారి గుండా తరలి వెళ్తున్నాయి. పత్రికల్లో వచ్చే శీర్షికలకు అధికారులు ఈ అడ్డుదారిగుండా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు ప్రజల సమాచారం బట్టి తెలుస్తోంది. అసలు పన్నులు విధిస్తున్నారా లేక అధికారులు జేబులు నింపుకుంటూ ఖాళీగా వదిలేస్తున్నారని దానిపై మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ అడ్డుదారి గుండా వెళ్లే వాహనాలకు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ప్రజలు ఒకపక్క హర్షిస్తున్నారు. కానీ అధికారులు పన్ను విధించినట్లు ఏ ఒక్కరికి తెలియపరచకపోవడం అసలు పన్నులు వసూలు అవుతున్నాయా, లేక అధికారుల జేబులు నిండుతున్నాయా, అనేది మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఈ తనిఖీలలో మండల కేంద్రానికి చెందిన వ్యక్తులు కూడా ఉంటున్నట్లు సమాచారం ఇలాంటి తనిఖీల పట్ల జిల్లా ఉన్నతాధికారులు పకడ్బందీ నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో అక్రమంగా అడ్డు దారి గుండా వెళ్లే వాహనాలకు అడ్డుకట్ట వెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Spread the love