– ఇంటింటి ప్రచారంలో సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ పిలుపు
నవతెలంగాణ – చండూరు
పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నియోజవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. గురువారంచండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి కేంద్ర బిందువైన భువనగిరి నియోజకవర్గం నుండి పార్లమెంటులో ఎర్రజెండా ప్రాతినిథ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలపై నికరంగా ఉద్యమిస్తున్న పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని బీజేపీ మతోన్మాదాన్ని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్న ప్రజల పార్టీ సీపీఐ(ఎం) అని, సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించితే పార్లమెంటులో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, బల్లెం స్వామి, బురుకల అంజయ్య గౌడ్, లక్ష్మమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.