ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – తుంగతుర్తి
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తుంగతుర్తి సీసీ గడ్డం గిరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కేశవాపురం,సింగారం తండ గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా రైతులు తప్పనిసరిగా 17% తేమను పరిశీలించుకోవాలన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన టోకెన్ల ఆధారంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ 2203, గ్రేట్ బి రకానికి క్వింటాకు రూ2183 మద్దతు ధర లభిస్తుంది అని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు,తూకం యంత్రాలు, టార్పాలిన్లు,తేమ శాతాన్ని పరిశీలించే యంత్రాలను సమకూర్చడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ నర్సింగ్ నాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love