ఏపీ, తెలంగాణకు సాగర్‌ నీటి విడుదలపై కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంది. అందులో ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతిచ్చారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే నీటిని వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

Spread the love