నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలోని అనేక దేశాలు సముద్రంలో లభించే చేపలు ఇతర జీవరాశులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సముద్రంలో లభించే సీ ఫుడ్ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీ పుడ్ లో అనేక రకాల చేపలు, తాబేళ్లు, ఇతన జీవరాశులు ఉంటాయి. అయితే కొన్ని రకాల జీవరాశులను తినడం ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి ఘటన తాజాగా తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో చోటు చేసుకుంది. సముద్రపు తాబేలు మాంసం తిని 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 78 మంది అస్పపాత్రి పాలయ్యారు. జాంజిబార్ సముద్ర దీవుల్లో దొరికే తాబేళ్లు రుచికరంగా ఉంటాయని ప్రసిద్ధి ఉంది. అయితే ఇక్కడ దొరికే సాధరణ తాబేలును కాకుండా భారీ సైజులో ఉన్న మరో తాబేలు వండారు. దీంతో ఫుడ్ పాయిజన్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. ఈ ఘటనపై పలువురు నిపుణులు స్పందిస్తూ.. కొన్ని రకాల తాబేళ్లలో కిలోనిటాక్సిజం అనే కెమికల్ ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసీ.. మరణానికి దారీతీస్తుందని.. అలాంటి వాటిని అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు.