నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. తమ్మినేని వీలైనంత త్వరగా కోలుకోని ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని సీఎం ఆకాంక్షించారు. తమ్మినేని వీరభద్రం అత్యంత వేగంగా రికవరీ అయ్యారని వైద్యులు సీఎంకు తెలిపారు. తమ్మినేని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన లీడర్ అని సీఎం కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రలో తమ్మినేనితో కలిసి రేవంత్ రెడ్డి నడిచిన జ్ఞాపకాలని సీఎం అందరికీ తెలియజేశారు. సీఎం వెంట రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల, పాలన వ్యవహారాలపై మంత్రి, సీపీఐ(ఎం) నాయకత్వంతో కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్, పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, తమ్మినేని కుమారుడు సంఘమిత్ర, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీదేవి ఉన్నారు.