నవతెలంగాణ హైదరాబాద్: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్ విభాగాల్లో దేశవ్యాప్తంగా 1,132 మంది సిబ్బందికి గ్యాలెంట్రీ/సర్వీస్ మెడల్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి 22 సేవా పతకాలు లభించాయి. వీటిలో ఆరు గ్యాలెంటరీ మెడల్స్, రెండు రాష్ట్రపతి పతకాలు, 12 ఉత్తమ ప్రతిభా పతకాలు, రెండు కరెక్షనల్ సర్వీసెస్ మెడల్స్ ఉన్నాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా శాఖలకు రాష్ట్రపతి ఆఫీసు నుంచి సర్టిఫికెట్లు వచ్చాయి. వాటిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా విభాగాధిపతులు అందించనున్నారు. డీజీపీ ఆఫీసుకు వచ్చే మెడల్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అందుకోనున్నారు.
గ్యాలెంట్రీ మెడల్స్
వడిచర్ల శ్రీనివాస్ జేసీ/పీసీ
నలివేణి హరీశ్ జేసీ/పీసీ
గడ్డిపోగుల అంజయ్య ఏఏసీ/ఆర్‌ఎస్
బూర సునీల్‌కుమార్ జేసీ/పీసీ
ఎండీ అయూబ్ జేసీ/పీసీ
పీ.సతీశ్ జేసీ/పీసీ
రాష్ట్రపతి విశిష్టసేవా పతకాలు
దేవేంద్రసింగ్ చౌహాన్, ఏడీజీ
సౌమ్యమిశ్రా, ఏడీజీ
కరక్షనల్ సర్వీసెస్ మెడల్స్
శ్రీధర్ ఆరాట్, జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్
రామయ్య యడారి, జైలర్
మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్
పరిమళ హనా నూతన్, డీఐజీ
డీ చంద్రయ్య, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
కొకు వీరయ్య, అడిషనల్ కమాండెంట్ 8వ బెటాలియన్
నరుకుళ్ల త్రినాథ్, కమాండెంట్
నూకల వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
పింగిళి నరేశ్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
శ్రీరాముల మోహన్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
బెల్లం జయచంద్ర, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఎనుమల వెంకటరెడ్డి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
గండిపూడి యేసుపాదం, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
జంగయ్య, హెడ్ కానిస్టేబుల్
మంచిరేవుల సురేందర్‌రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్