యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – యాదగిరి గుట్ట 
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నర్సింహ్మా స్వామిని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో గుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుండి రాష్టపతి భవనం కు చేరుకున్న ముఖ్యమంత్రి సంప్రదాయ దుస్తులతో కోండ పైకి చేరుకోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉత్సవ ప్రారంభంలో పాల్గోని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కూమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కోండ సురేఖతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏంఏల్ ఏలు పాల్గొన్నారు.

Spread the love