రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

నవతెలంగాణ – హైదరాబాద్‌: గతంలో రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నాం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మార్చి 12న మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నాం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చాం’’ అని తెలిపారు.

Spread the love