జ‌పాన్‌లో భూకంపం.. 9 మందికి స్వ‌ల్ప గాయాలు

నవతెలంగాణ – టోక్యో: జ‌పాన్‌లో ఇవాళ బ‌ల‌మైన భూకంపం న‌మోదు అయ్యింది. సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఆ ప్ర‌కంప‌న వ‌చ్చింది. ఈ భూకంపం వ‌ల్ల సుమారు 9 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అయితే సునామీ వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేద‌ని అధికారులు చెప్పారు. షికోకో దీవికి ప‌శ్చిమ దిక్కున 6.6 తీవ్ర‌తో భూకంపం న‌మోదు అయ్యింది. షికోకు, క్యుషు దీవుల మ‌ధ్య భూకంప కేంద్రం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. స‌ముద్ర ఉప‌రిత‌లానికి 50 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం న‌మోదు అయ్యింది. షికోకు రైల్వే స‌ర్వీస‌ల‌ను కొన్ని ప్రాంతాల్లో ర‌ద్దు చేశారు. ఇకాటా న్యూక్లియ‌ర్ కాంప్లెక్స్ వ‌ద్ద విద్యుత్త స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డింది. సుకుమో ప్రాంతంలో సుమారు 23 మందిని పాక్షికంగా త‌ర‌లించారు. ఇవాళ భూకంపం వ‌చ్చిన ప్రాంతంలో రానున్న 30 ఏళ్ల‌లో రిక్ట‌ర్ స్కేల్‌పై 8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నట్లు అధికారులు అంచ‌నా వేశారు.

Spread the love