‘జైలర్’ పాటకు జపాన్‌ రాయబారి ఫిదా..

నవతెలంగాణ – హైదరాబాద్: రజనీకాంత్‌ ‘జైలర్‌’. ఈ చిత్రంలోని ‘‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’’ పాటకు కూడా జపాన్ యువత స్టెప్పులేస్తోంది. అయితే ఈసారి కాస్త వెరైటీగా.. ఈ పాటకు భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి డ్యాన్స్‌ వేశారు. ప్రముఖ యూట్యూబర్‌ మాయో సాన్‌తో కలిసి ఆయన ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. రజనీకాంత్‌పై తన ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు.

Spread the love