కేసీఆర్ కు మొగుడు రేవంత్ రెడ్డే: కోమటిరెడ్డి

– రేవంత్ రెడ్డి తెలివి కల్ల వారు.. శిష్యుడికి టికెట్ ఇచ్చి గెలిపించేందుకు నాకేమో ఇన్చార్జ్ ఇచ్చాడు..
– కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో మిగిలేది ముగ్గురే..
– మునుగోడులో వందమంది ఎమ్మెల్యేలతో వచ్చి ఊడగొట్టిన రోజే కేసిఆర్ కు పతనం మొదలైంది..
– ఉప ఎన్నికల్లో 97 వేల ఓట్లు రాజగోపాల్ రెడ్డికి అభిమానంతో పడినవి కానీ అవి బీజేపీ ఓట్లు కావు..
– భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సొంత ఆస్తులను అమ్మైనా రాజకీయం చేస్తారు కానీ, రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ తోని పైసలు ఖర్చు పెట్టించి, కేసీఆర్ ను పడగొట్టే అంత తెలివి రేవంత్ రెడ్డికి ఉందని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసఆర్ ప్రభుత్వం నియంతృత పాలన కొనసాగుతుందని,  మునుగోడు గడ్డపై యుద్ధం ప్రకటిస్తే కేసీఆర్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలతో వచ్చి నన్ను ఓడించిన రోజే, కేసీఆర్ పార్టీ పతనం కావడం ఖాయమని చెప్పానని అన్నారు. పది సంవత్సరాలు ప్రభుత్వమును అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ ను ఓడించడంతోపాటు, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పోవడం ఖాయమని చెప్పినది వాస్తవం కాదా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ను పడగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రసంగాలు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం కాదు, పది సంవత్సరాలు పరిపాలన చేసి చూపిస్తామని అన్నారు.
కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు మాత్రమే అని అన్నారు.  పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, చలమల అమిత్ షా తో ఫోటో తో ఏదో చేయాలనుకున్నాడు  కానీ ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో 97  వేల ఓట్లు పడ్డాయి కానీ అవి బీజేపీకి పడిన ఓట్లు కావన్నారు.  భువనగిరి పార్లమెంటు పరిధిలో బీజేపీ కి ఓటు లేవు. బీఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కానీ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ , మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి  తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా  కోమటిరెడ్డి బ్రదర్స్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బూర నర్సయ్య గౌడ్, జగదీశ్వర్ రెడ్డి లాగా కోమటిరెడ్డి బ్రదర్స్ పదవుల కోసం పాకలాడే వ్యక్తులు కారని అన్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు . తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ దుకాణం బంద్ అయిందని అన్నారు . గతంలో నాయకులు  కేసీఆర్ కు 100 సార్లు ఫోన్లు చేసినా  పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తానని నాయకులకు  ఫోన్ చేసిన గాని మాకు టికెట్లు వద్దు  అంటూ నాయకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలివి కల్ల వారన్నారు అని శిశువుకు టికెట్ ఇచ్చి శిష్యుడు గెలుపు కోసం తమ నివాసంకు వచ్చి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు అని తెలిపారు.  భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి  చామల కిరణ్ గెలుపు పోటీ బీజేపీ, బీఆర్ఎస్ తో కాదని భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న  ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా  మెజార్టీ కోసం  నియోజవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. ఏడు నియోజకవర్గాలలో ఏ నియోజవర్గంలో అధిక మెజార్టీ వస్తే ఆ నియోజకవర్గాని అభివృద్ధి కోసం  సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులతో రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తామని సవాలు విసిరారు. మొదటిసారిగా భువనగిరి పార్లమెంట్  ఎంపిగా తమను గెలిస్తే ఐదు సంవత్సరాలు తెలంగాణ సాధన కోసం పోరాడిన , ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేగా  అభివృద్ధి కోసం ప్రజలు తమను గెలిపిస్తే అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్ పది సంవత్సరాలు నియంత పాలన సాగిస్తుంటే, అసెంబ్లీలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ప్రశ్నించిన అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.
మునుగోడు రూపురేఖలు మార్చేందుకు మంచి అవకాశం వచ్చిందని, ఈ ఐదు సంవత్సరాలలో మునుగోడు అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య యాదవ్ , కుంభం అనిల్ రెడ్డి , మందుల సామెల్ , వేముల వీరేశం , మాల్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ వివిధ మండలాల ఎంపీపీలు , జడ్పీటీసీలు , కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love