కల్వకుంట్లలో కనుల సంబరంగా సాగిన జహంగీర్ ప్రచార ర్యాలీ..

నవతెలంగాణ – మునుగోడు
సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం సోమవారం రాత్రి మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో జరిగిన ప్రచార ర్యాలీ కనుల సంబరంగా  సాగింది ప్రచారానికి వచ్చిన అభ్యర్థి జహంగీర్ కు గజమాలతో సన్మానించి గ్రామంలో వాడవాడలా డిజె సౌండ్ బాక్స్ లతోపాటు కోలాట డప్పు బృందాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ భువనగిరి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి చూయించి ప్రజల్ని ఓట్లు అడగాలని అన్నారు. ఎంపీగా ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే, అభివృద్ధి చేయని బూర నర్సయ్యకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగి అర్హత లేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలియని, అవగాహన లేని వ్యక్తులని కేవలం ప్రజాబలం లేకుండా ధన బలంతో వస్తున్న వ్యక్తులకు ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. గత 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ప్రజా ఉద్యమాలలో ఉండి పోరాడిన తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తానని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలపై పోరాడే తమ ను ఆశీర్వదించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎర్రజెండా పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు..
ఎన్నికల సమయంలో  అధికారంలోకి వచ్చేందుకు బూజో పార్టీలు ప్రజలకు డబ్బు , మద్యంతో ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ప్రశ్నించే  గొంతుగా ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండా పాలన కోసం  ప్రజలు ఎదురుచూస్తున్నారు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి జహంగీర్ నామినేషన్ ర్యాలీతోనే సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండ చరిత్రను పునరావృతం చేయడానికి కార్మికులు కర్షకులు నడుం బిగించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా కు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రైతంగ సాహిత పోరాటంలో కమ్యూనిస్టులు వీరవచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి, గెలిచిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్రజెండానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట రమణారెడ్డి , పద్మ, కొండ వెంకన్న, మునుగోడు మండల కార్యదర్శి మీర్యల భరత్, సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు,   నారగోని నరసింహ, బొందు అంజయ్య ,మాజీ సర్పంచ్ సింగపంగా గౌరయ్య, పగిళ్ల పరమేష్, కట్ట ఆంజనేయులు, పగిళ్ల మధు, కట్ట లింగస్వామి తదితరులు ఉన్నారు.
Spread the love