నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.