నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తాం

– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
 ఎంపీ గా గెలిచిన 30 రోజుల్లో 100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి యువతకు అండగా నిలుస్తామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి కి మద్దతు గా లింగం పేట లో ఉపాధి హామీ పనుల వద్ద ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్టు ఏర్పాటు ద్వారా 7 నియోజక వర్గంలలో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేద యువతీ, యువకులకు కోచింగ్ ఇప్పించే విదంగా  కృషి చేస్తామన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ అందిం చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో  ఫంక్షన్ హాల్ నిర్మించి నిరు పేదలకు ఉచితంగా వివాహాలు చేసుకునే విదంగా నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తామ న్నారు. కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కి విశేషమైన పరిపాలనా అనుభవం ఉందని, పార్ల మెంటు లో తెలంగాణ గళం వినిపించడం కోసం ఎంపీగా ఓటు వేసి గెలుపించాలని కోరారు. తాగు, సాగు నీళ్లు, 24 గంటల కరెంటు అందించిన కేసీఆర్ కే జై కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో మాజీ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు అభీద్ హుస్సేన్, జంగిడి భిక్షపతి, నాయకులు మంగ నర్సింలు, గొడుగు ఐలయ్య, మంగ యాదగిరి, శేరుపల్లి స్వామి, లక్ష్మణ్, కె. కర్ణాకర్, ప్రకాష్, రాజు, గణేష్, నర్సింలు, దినేష్, తోయేటి వెంకటేశం, అంకుశం, నాగరాజు, శ్రీకాంత్, భాస్కర్, రాజు, మల్లేశం, లచ్చయ్య, కనకరాజు, నర్సింలు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love