తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు..

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానుకొండూర్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Spread the love