దశాబ్ది ఉత్సవాలలోనైనా పెన్షనర్ల సమస్యల పరిష్కరించాలి.

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగులు, పెన్షనర్లు  అగ్ర భాగాన నిలిచి పోరాడారని కానీ ఈ పది సంవత్సరాల కాలంలో వీరు ఎంతో నిర్లక్ష్యానికి  గురయ్యారని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్  జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం నాందేవ్ వాడలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. పెండింగ్ డిఎ లను విడుదల చేయడంలో , పే రివిజన్ కమిటీని ఏర్పాటు చేయడంలో, నగదు రహిత వైద్యం అందించటంలో, మొదటి తారీకు నే పెన్షన్ పొందే పరిస్థితి లేదని, రిటైర్ అయిన రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ ఏక మొత్తంలో అదే రోజున ఇచ్చి గౌరవంగా పంపించాలని చెప్పిన మాటలు నీటి మీద రాసిన రాతల్లా  మారాయని ఇప్పుడు ఆ ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని వారన్నారు. ఈ కుబేర్లో బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయని వారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, ఈవియల్ నారాయణ, ముత్తారం నరసింహస్వామి, శిర్ప హనుమాన్లు, అందే సాయిలు, రాధా కిషన్, లావు వీరయ్య , ఉషాన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love