
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించారు. రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌ను, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్‌ను, ఎక్సైజ్ కమిషనర్‌గా ముషారఫ్ అలీ ఫారుఖీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.