అల్ప కిషన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కలెక్టర్..

– ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అల్ప కిషన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కలెక్టర్ తదితరులు
నవతెలంగాణ-  కంటేశ్వర్
ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుక కిషన్ ని ఆహ్వానించి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నూతన కలెక్టర్ కార్యాలయం (IDOC) నందు గౌరవ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్ శాసనసభ్యులు పియుసి చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి, కార్యక్రమానంతరం ఐ డి ఓ సి టీఎన్జీవో కార్యాలయం నందు ఏర్పాటుచేసిన అలుక కిషన్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ ని గజమాలతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఉద్యోగుల వివిధ సమస్యలపై చర్చించారు.. అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ ఛాంబర్ నందు అలుక కిషన్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా టీఎన్జీవో జిల్లా కార్యవర్గం, టీఎన్జీవో యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు మరియు వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు విచ్చేసి కిషన్ ని ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , టీఎన్జీవో మాజీ కార్యదర్శి సంఘం అమృత్ కుమార్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , సలహాదారులు ఆకుల ప్రసాద్ , కేంద్ర సంఘ గదిలో పోల శ్రీనివాస్, సతీష్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు బి ఎల్ శంకర్ ,నాగరాజు ,వసుమతి దేవి, జాఫర్ హుస్సేన్ ,సత్యం, అతిక్, సుమన్, దినేష్, షికారి రాజు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love