ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాక్

నవతెలంగాణ – అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్ చేశారు. అధ్యక్షుడిగా మీ టర్మ్ పూర్తి అయిందని. పదవికి రాజీనామా చేయాలని వీర్రాజుకు నడ్డా సూచించారు. ఏపీ నూతన అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించనున్నట్టు సమాచారం. వీర్రాజుకు ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Spread the love