ఉత్తమ నగర అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్

నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో నిర్వహించిన అర్బన్ డే కార్యక్రమంలో లక్షకు పైగా జనాభా కలిగిన హరితహారం నిర్వహణలో ఉత్తమ నగరంగా నిజామాబాద్ నగరానికి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ నిజామాబాద్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా అందుకున్నారు. ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళిక బద్దంగా పర్యవేక్షించి నాగరాన్ని సుందరికరణ చేస్తూ ప్రజలకు అద్భుతమైన వాతావరణం అందించాలని చేసిన కృషికి దక్కిన ఫలితంగా ఈ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్బంగా నగర మేయర్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త కి మున్సిపల్ కార్పొరేటర్లకు, ఆదికారులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Spread the love