నవతెలంగాణ-భిక్కనూర్
పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి దేవేందర్ తెలిపారు. సోమవారం మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించి గ్రామంలో గల పశువులకు టీకాలు వేసి, వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమలత, పాల కేంద్రం అధ్యక్షులు లోహిత్ రెడ్డి, సొసైటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.