తాటిచెట్టుపై నుండి గీత కార్మికుడికి గాయాలు

నవతెలంగాణ-వీణవంక
తాటిచెట్టుపై నుండి పడి ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వల్బాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వల్బాపూర్ గ్రామానికి చెందిన అగ్గి భాస్కర్ అనే గీత కార్మికుడు రోజువారిగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో చెట్టు ఎక్కుతుండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో భాస్కర్ కు గాయాలయ్యాయి. గమనించిన బంధువులు, గీత కార్మికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జమ్మికుంటకు తరలించారు.

Spread the love