హైదరాబాద్‌లో చిరుజల్లులు..

నవతెలంగాణ-హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజామున ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, నాగోల్‌, కర్మాన్‌ఘట్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, మెహిదీపట్నం, సరూర్‌నగర్‌తోపాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శీతల గాలులు వీయడంతో నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. అయితే ఉదయం 7 గంటల వరకు ఆకాశం మేఘావృతమైన ఉన్నది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గిపోయాయి. కాగా, బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారులు గ్రేటర్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love