గణిత భాషా సామర్థ్యాల నిచ్చెన మెట్టు

– ఆర్జెడి కె. సత్యనారాయణ రెడ్డి

నవతెలంగాణ-వీణవంక
గణిత, భాష నైపుణ్య సామర్థ్యాల సాధనకై వీణవంక హైస్కూల్లో ఏర్పాటు చేసిన తొలిమెట్టు రెండవ రోజు తెలుగు ఉపాధ్యాయ శిక్షణ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాటిపల్లి. సత్యనారాయణ రెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బోధనాభ్యసన ప్రక్రియలో సోపానాలను ఉపాధ్యాయులు ఆకలింపు చేసుకున్నప్పుడే బోధనాభ్యసన ప్రక్రియ అర్థవంతంగా, ప్రణాళిక బద్ధంగా నిర్వహించబడుతుంద న్నారు.తెలుగు భాష బోధన కోసం రోజు 90 నిముషాల సమయం ఉంటుందని మొదటి 45 నిముషాల బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహణ కోసం, రెండవ 45 నిముషాల విద్యార్థులకు చదవదానికి, రాయడానికి అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థుల్లో మౌఖిక స సామర్థ్యాలతో పాటు పటన,లేఖన సామర్థ్యాలు పెంపొందించా లన్నారు. ఉపాధ్యాయుడు మార్గదర్శిగా స్వయంగా చేసి చూపడం, జట్టు పని ద్వారా భాగస్వామ్య అభ్యసనకు అవకాశం కల్పించి, పిల్లలతో కలిసి పని చేయాలన్నారు.5+1 విధానం ప్రకారం వారంలో ఐదు రోజులు బోధనా అభ్యసన ప్రక్రియ నిర్వహించి, ఆరవ రోజు పిల్లల ప్రగతిని పరిశీలించి నమోదు చేయాలన్నారు. అనంతరం హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులతో సమావేశమై వివిధ సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పబ్లిక్ పరీక్షల కోసం విద్యార్థులు సంసిద్ధులు కావలసిన తీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ సుద్దాల శోభారాణి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి, ఆర్పీలు తిరుపతిరెడ్డి, బాలాజీ, శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి వెంట ఉన్నారు.
Spread the love