లింగంపల్లి వద్ద 35 కిలోల గాంజాయ్ స్వాధీనం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నాంపల్లి ప్రభుత్వ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో 35 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నాంపల్లి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఏ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సికింద్రాబాద్ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  షేక్ సలీమా ఐపీఎస్ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో రైలను తనిఖీ చేసామన్నారు. లింగంపల్లి వద్ద  భువనేశ్వర్ టు ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో తనిఖీ చేస్తుండగాఇద్దరు వ్యక్తులు అనుమాదాస్పదంగా కనిపించడంతో వానిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 35 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు  రాహుల్. ఆకాష్ రావు సాహెబ్ లో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రలోని పూణేకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు చెప్పినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న సిఐబి ఇన్ స్పెక్టర్ రవిబాబు. ఆర్పిఎఫ్ సిబ్బంది. జి ఆర్ పి హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్ లను రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ సలీమా ఐపీఎస్. సికింద్రాబాద్ అర్బన్ డిఎస్పి నరసయ్య లు అభినందించారు. వీరికి రివార్డు ప్రకటించినట్లు తెలిపారు.
Spread the love