రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కోసం దరఖాస్తు చేసుకోండి

–  ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్
నవతెలంగాణ- కంటేశ్వర్
సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూన్ 18 న నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కోసం నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల యువతీ, యువకులు, విద్యార్థిని,విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్ గుపనపల్లి లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(KITS) (ఉమెన్స్) కళాశాలలోని విద్యార్థులను కలిసి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కు సంబంధించి వివరాలను తెలియజేయడంతో పాటు దగ్గరుండి విద్యార్థులతో ఆన్లైన్ క్విజ్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది .ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ.. సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూన్ 18 న నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని కావున ఈ యొక్క పోటీలో నిజామాబాద్ జిల్లా లో గల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పోటీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా 7661899899 గల నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ వెబ్ లింక్ తో కూడిన ఒక ఎస్.ఎం.ఎస్(SMS) ను పొందుతారని ఆ లింకు ద్వారా వారి వివరాలను 0083 అని రిఫరల్ కోడ్ ద్వారా అందులో జూన్ 17 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. పోటీలో పాల్గొన్న అభ్యర్థులకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రథమ బహుమతి కింద ల్యాప్ టాప్, ద్వితీయ బహుమతి కింద స్మార్ట్ ఫోన్, తృతీయ బహుమతి కింద ట్యాబ్ లెట్ తోపాటు ప్రతి నియోజకవర్గంలో 40 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని ప్రోత్సాహక బహుమతులలో 10 స్మార్ట్ వాచ్లు, 10 ఇయర్ పాడ్లు, 10 హార్డ్ డ్రైవ్ లు ,10 పవర్ బ్యాంకులు బహుకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళా టాపర్లకు ప్రత్యేక బహుమతుల కింద ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా బహుకరించడం జరుగుతుందని ఈ బహుమతిని సోనియా గాంధీ చేతుల మీదుగా హైదరాబాదులో ప్రధానం చేస్తారని ఆయన తెలియజేశారు. ఈ యొక్క ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కి 60 నిమిషాల్లో 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుందని అంశాలన్నీ కూడా భారతదేశ భౌగోళిక ,చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం , తెలంగాణ సాంస్కృతి, చరిత్ర, సామాజిక ఉద్యమాల తోపాటు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మరియు అర్థమెటిక్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయని ఆయన తెలిపారు.కావున నిజామాబాద్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిధిలో 16 నుండి 35 సంవత్సరాలు గల విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని అలాగే క్విజ్ కాంపిటీషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం 8142903456 మరియు 8142803456 నెంబర్లకు కాల్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల పరిధిలోగల అభ్యర్థులకు ఇంకా ఏమైనా ఏవైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా తనను సంప్రదించవలసినదిగా వేణురాజ్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు రమేష్ చంద్ర సందీప్ రెడ్డి, సాగర్, కళాశాల విద్యార్థులు నితన్, దీక్షిత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love