సంపద సృష్టికర్తలు కార్మికులు…

– కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
– రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.జయరాజు
నవతెలంగాణ-సదాశివపేట
సమాజంలో దేశ సంపదను కార్మిక వర్గం, రైతులు మాత్రమే సృష్టిస్తున్నారని.. సంపద సష్టించే వారికి శ్రమకు తగ్గ వేతనం రావడం లేదని, రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని.. కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.జయరాజ్‌ అన్నారు. మే డే సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో భాగంగా రెండో రోజైన శనివారం స్థానిక మోనా ప్లే స్కూల్‌లో చెస్‌, క్యారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాజ్‌ మాట్లాడుతూ.. సమాజంలో శ్రమ లేనిది ఏ వస్తువూ ఉత్పత్తి కాదన్నారు. రైతులు, కార్మికులు మాత్రమే దేశ సంపదను సష్టిస్తున్నారన్నారు. సంపద సష్టించే వారికి మాత్రం పనికి తగ్గ ఫలితం రావడం లేదన్నారు. సంపద ఒక్కరు సష్టిస్తే.. పాలకవర్గాలు మాత్రం పెట్టుబడుదారులకు రాయితీలు ఇస్తున్నారన్నారు. వర్షంలో కార్మికుడు పనిచేసి శ్రమపడి వస్తు వులు ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులను అమ్ముకునే పెట్టుబడు దారులు కోట్ల రూపాయలు లాభాలు అర్జిస్తున్నారన్నారు. శ్రమ చేసే కార్మికుడు మాత్రం అరాకుర జీవనం సాగిస్తున్న పరి స్థితి ఉందన్నారు. కార్మికు అనుకూలంగా ఉన్న చట్టాలను మొత్తం పెట్టుబడుదాలకు అనుకూలంగా తయారు చేస్తున్నా రు. రాబోయే కాలంలో కార్మికుల రైతులు ఐక్యంగా పాలక వర్గాలపై పోరాటాలు నిర్వహించిన అవసరం ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో భవిత జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలరాజు మాట్లాడుతూ.. సీఐటీయూ సంఘం కార్మికుల సమస్యల కోసం పని చేస్తూనే కాకుండా ఆటల పో టీలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్‌ కుమార్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనిల్‌, మేడే నిర్వహణ కమిటీ సభ్యులు మల్లేశం, శ్రీనివాస్‌, జి శ్రీనివాస్‌, నాగరాజు స్వావి ు, ప్రశాంత్‌, మోనా ప్లేస్కూల్‌ యాజమాన్యం పాల్గొన్నారు.

Spread the love