గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

– జీపి కార్మికుల సమస్యలను రాష్ట్ర పరిష్కరించాలి
– సీఐటీయూ ఆధ్వర్యంలో  ఎంపిడివో కార్యాలయం ఎదుట ఉమ్మడి దుబ్బాక మండల గ్రామ పంచాయతీ కార్మికులే సమ్మె 
– సమ్మెకు మద్దతు తెలిపిన  సీఐటీయూ మండల నాయకులు 
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి, వెంటెనే  రాష్ట్ర ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేయాలని  సిఐటీయూ మండల నాయకులు ఎండీ. సాధిక్ డిమాండ్ చేశారు. గురువారం ఉమ్మడి దుబ్బాక మండల పరిధిలోనీ 30 గ్రామ పంచాయతీల్లోపని చేస్తున్న   కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మె బాట చేపట్టారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ మండల నాయకులు ఎండీ. సాధిక్ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జీవో ప్రకారం వేతనాలను పెంచాలని ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులకు కనీస వేతనాల తో పాటు వారిని పర్మినెంట్ చేయడం కోసం జరుగుతున్న పోరాటాలకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయితీల్లో వారికి  సేవలను అందిస్తున్న వారి సమస్యలనుపట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయితీల్లోపని చేసేందుకు కార్మికులు కావాలి కానీ వారీ బాగోగులు మాత్రం పట్టవా అని మండిపడ్డారు. జీవో ప్రకారం గ్రామ పంచాయితీల్లో పనిచేసే కార్మికులందరికీ న్యాయం చేసే వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశాంత్, శ్రీను, రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
Spread the love