ట్రెండ్స్ ఆద్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

నవతెలంగాణ – అశ్వారావుపేట
రిలయన్స్ వ్యాపార సంస్థల సంప్రదాయంలో భాగంగా వారి వినియోగదారుల్లో గల వివిధ రంగాల్లోని పలువురు ప్రముఖులను ప్రత్యేక సందర్భాల్లో గౌరవించడం ఆచారం. ఈ క్రమంలో శనివారం స్థానిక ట్రెండ్స్ వస్త్ర దుకాణంలో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు.ఈ దుకాణం మేనేజర్ పెద్ది రాజు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.ఎం.పి వైద్యులు,ప్రముఖ పత్రికా విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు చేతులు మీదుగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది, ట్రెండ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love