సేంద్రియ వ్యవసాయం రైతులకు లాభం..
నవతెలంగాణ- మణుగూరు
పకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం రైతులకు లాభదాయకమని ఏడిఏ తాతారావు అన్నారు. శనివారం మణుగూరు వ్యవసాయం మండల పరిధిలోని గుట్టమల్లారం రైతువేదిక నందు అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ ఐఏఎస్ పర్యటించారు. మణుగూరు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి తాతారావు మరియు డివిజన్ పరిధిలోనీ మండల వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సౌరభ్ శర్మ కి డివిజన్ లోని వ్యవసాయ పంటలు , వ్యవసాయ పథకాలు గురించి వివరించారు.
రైతు భరోసా,రైతుబిమా,పంటల నమోదు ,పంట కోత ప్రయోగాలు, ప్రకృతి వ్యవసాయం,సేంద్రియ వ్యవసాయం, బయో చర్కోల్,కంపోస్టు తయారీ,మునగ సాగు మరియు ఎరువుల , పురుగు మందుల నాణ్యత పరిశీలన తదితర అన్ని విషయాలపై సమీక్షించారు. పంటల బీమా మరియు ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు తీసుకొనే చర్యలు గురించి పరిశీలించారు. రసాయన ఎరువుల వాడకం ,రైతులకు వ్యవసాయ శాఖ వారు ఇచే శిక్షణ కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ లు వెంకటేశ్వర్లు ఛటర్జీ రాహుల్ రెడ్డి ఏఈఓ లు కొమరం లక్ష్మణరావు నాగేశ్వరరావు హారిక రమేష్ రమాదేవి సౌమ్య వ్యవసాయ శాఖ సిబ్బంది సత్యనారాయణ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయం.. రైతులకు లాభదాయకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES