నవతెలంగాణ – వలిగొండ రూరల్
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు యూరియా కొరత కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి చేసి రైతాంగానికి సరిపడా యూరియా అందచేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాల్ రాజు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు బిజెపి ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి సక్రమంగా యూరియాను తీసుకురాలేకపోతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వ ముందుచూపులేని అసమర్థత వల్ల యూరియా కొరత సృష్టించబడిందన్నారు.
రాష్ట్రంలో పంటల సాగుకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ సీజన్ కు అందించాల్సి ఉండగా ..కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల రైతాంగానికి యూరియా అంధక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సక్రమంగా యూరియా అందక రైతులు ఇల్లు పొలాలను వదిలి యూరియా కోసం క్యూ లైన్ లలో పడి కాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా ప్రైవేట్ కంపెనీడీలర్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సిర్పంగి స్వామీ, కూర శ్రీనివాస్, కొండే కిష్టయ్య, దుబ్బ లింగం, బూడిద మణెమ్మ, గర్దాసు నరసింహ,దయ్యాల మల్లేశం, కందగట్ల సాయి రెడ్డి, వేముల లక్ష్మయ్య, శీలం ఇందిర,చేగురి నగేష్, కొమ్ము స్వామి,పెద్దబోయిన భీమరాజు, బూడిద సైదులు,కోరబోయిన మహేష్, మైసొల్ల నరేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.