Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంట పొలాలలోని ఇసుకను తొలగించుటకు సన్నద్ధం

పంట పొలాలలోని ఇసుకను తొలగించుటకు సన్నద్ధం

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ ల ఆదేశాల మేర ఈరోజు భీంగల్ మండలంలో భారీ వర్షాలతో వరద తాకిడి కారణంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య, ఉపాధి హామీ ఎపిఓ జి నరసయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు శ్రీలత సందర్శించడం జరిగింది. మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ… ఇసుక మీటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకంలో కూలీల ద్వారా తీయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనున్నదని కావున ఇట్టి భూములను సందర్శించడం జరిగిందని తెలిపినారు.ప్రభుత్వ ఆదేశానుసారము అంచనాలు తయారు చేసి ఇసుకను తొలగించడం జరుగుతుందని వివరించారు. భీంగల్ మండలంతో పాటు బడా భీంగల్, పెద్దమ్మకాడి తండా, సికింద్రాపూర్, గోను గోపుల, బెజ్జోరా, ముచ్కూర్ గ్రామాలలో తీవ్రత ఎక్కువగా ఉందని భావించి వెంటనే అంచనాలు తయారు చేయాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించినారు. ఈ పనిని ఉపాధి హామీ కూలీల ద్వారా చేపట్టనున్నామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad