Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

పోటీ – గెలుపు
వరుణ్‌ : రెండు పోటీల్లో గెలిచావట. ఏమేం పోటీలవి?
వివేక్‌ : ఒకటి జ్ఞాపకశక్తిలో… రెండవది గుర్తు రావట్లేదు అన్నయ్యా..

ఎంత కష్టం?!

భార్య: మీరు రోజు తాగి ఎంజారు చేస్తూ.. నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు.
భర్త : నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం? ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది.
భార్య : ఛీ.. ఇంత ఘాటుగా వుందేమిటి? నాలుక మండిపోతోంది. ఎలా తాగుతున్నారండీ?
భర్త : ఏం చేయమంటావ్‌.. బంగారం.. నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే.. నేను మాత్రం ఎలా సుఖపడతాను. అందుకే ఎలా ఉన్నా కష్టపడి తాగుతున్నా..!

ఎంత పెద్దదో…
తల్లి : అన్నయ్య శ్లోకం ఎంత బాగా రాస్తున్నాడో చూడు.. పెద్దయ్యాక నువ్వు రాయాలి.
చింటు : అప్పటి దాకా ఆ శ్లోకం రాయడమవ్వదామ్మా..

కానుక
భార్య : మన వంటవాడికి నెల రోజులు సెలవు ఇచ్చేసి నేనే స్వయంగా మీకు వండి పెట్టాలనుకుంటున్నాను, అలా చేస్తే నాకు ఏం కానుక ఇస్తారు?
భర్త : నా ఇన్సూరెన్స్‌ డబ్బు!

లెక్క తేలింది
సురేష్‌ : పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా?
రాజేష్‌ : అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్‌?
సురేష్‌ : మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి..!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad