
– పరిశీలించిన ఎం.పి.డి.ఓ శ్రీనివాస్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గృహలక్ష్మి దరఖాస్తులు పరిశీలనా సర్వే మండలంలో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ని గురువారం ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ గిరిజన గ్రామాలు అయిన కన్నాయిగూడెం, గాండ్లగూడెం, కావడిగుండ్లలో పరిశీలించారు. గృహలక్ష్మి పథకం విధివిధానాలు ఆధారంగా, పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలించాలని కార్యదర్శులకు సూచించారు. కచ్చా గృహాలు,పూరి గుడిసెలు, శిధిలావస్థలో ఉన్న గృహ నివాసులు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనంతరం కన్నాయిగూడెంలో పంచాయితీ నూతన భవన నిర్మాణ పనులను తనిఖీ చేసారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ గొంది లక్ష్మణ్ రావు, కార్యదర్శి విద్యాసాగర్ లు ఉన్నారు.