Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిమస్తు మజా…

మస్తు మజా…

- Advertisement -

బాల్యం ఓ మధుర స్వప్నం. అభంశుభం తెలియని అమాయక పిల్లలు.. వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే, అదంతా తమదేననుకని మురిసిపోతారు. కాకపోతే 80, 90లతో పోలిస్తే, ఇప్పటి బాల్యం కాన్వెంట్‌ స్కూళ్లలో, కార్పొరేట్‌ బళ్లలో నలిగిపోతోంది. పొద్దున లేస్తే చదువు, చదువు అంటూ తల్లిదండ్రులు చిన్నారులపై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. తమ జీవితంలో సాధించలేని ఆశలను వారిపై బలవంతంగా రద్దుతున్నారు. ఈ ఒత్తిడికి చిత్తయిపోతున్న పిల్లలు.. ఒక్కరోజు సెలవు దొరికితే చాలు.. పరమానందం పొందుతున్నారు. అలాంటిది వరసగా రెండు, మూడు వారాల్లో వారినికి మూడు రోజులు సెలవులొస్తే, బుడతలకు పండగే కదా… ఆగస్టులో ఒక వారంలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, ఆ వెంటనే ఆదివారం, ఆ మరుసటి వారంలో పంద్రాగస్టు, శ్రీకృష్ణాష్టమి, ఆ మరుసటి రోజు ఆదివారం రాగా.. ఇప్పుడు సెప్టెంబరు మొదటి వారంలో మిలాదున్‌నబీ, ఆ తర్వాత గణేష్‌ నిమజ్జనం, ఆ వెంటనే ఆదివారం రావటంలో పిల్లలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మస్తు మజారా బరు.. అంటూ సెలవులను ఎంజారు చేస్తున్నారు. కాకపోతే.. ఆ చిచ్చర పిడుగుల అల్లరి భరించటమే తల్లిదండ్రులకు ‘పెద్ద టాస్క్‌’ అయి కూర్చుంది… ఇదే ఇలా ఉంటే.. ఈనెల 22 నుంచి దసరా సెలవులు ఉన్నాయి… అప్పుడు పిల్లల ఆటాపాట ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటే…
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad