- 2-2తో నిలువరించిన భారత్
- హాకీ మహిళల ఆసియా కప్
హాంగ్జౌ (చైనా) : డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లో రెండు సార్లు వెనుకంజ వేసినా.. టీమ్ ఇండియా అమ్మాయిలు పుంజుకున్నారు. ఆఖరు నిమిషంలో గోల్ కొట్టి స్కోరు సమం చేశారు. ఆసియా కప్ గ్రూప్ దశలో రెండో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించారు. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో థారులాండ్‌పై 11-0తో ఏకపక్ష విజయం సాధించిన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. పదో నిమిషంలోనే జపాన్ 1-0తో ముందంజ వేయగా.. 30వ నిమిషంలో రుతుజ గోల్‌తో భారత్ 1-1తో నిలిచింది. 58వ నిమిషంలో జపాన్ రెండో గోల్ కొట్టగా.. 60వ నిమిసంలో నవనీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి లెక్క సమం చేసింది. వెటరన్ గోల్‌కీపర్ సవిత పూనియా, డ్రాగ్‌ఫ్లికర్ దీపిక గాయాలతో టోర్నమెంట్‌కు దూరమైనా భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. గ్రూప్-బి ఆఖరు మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్4లో టాప్-2 జట్లు ఫైనల్లో పోటీపడతాయి.