Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅమెరికాతో భాగస్వామ్యానికి మోడీ ప్రాముఖ్యత: జైశంకర్‌

అమెరికాతో భాగస్వామ్యానికి మోడీ ప్రాముఖ్యత: జైశంకర్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ట్రంప్‌ టారిఫ్‌ల నేపథ్యంలో భారత్‌- అమెరికా సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరుదేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడారు. అమెరికాతో భాగస్వామ్యానికి మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో కూడా ఆయనకు బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. అగ్రరాజ్యంతో భారత అధికారుల సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించారు. చైనా, రష్యా, భారత్‌లు దగ్గరైన నేపథ్యంలో ఆయన స్వరం మారుస్తూ.. మోడీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌- అమెరికాలది ప్రత్యేక బంధమని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై మోడీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇరుదేశాల సంబంధాలపై ట్రంప్‌ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందించారు. భారత్‌, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad