సాంకేతిక విద్యాశాఖలో 485 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కొనసాగింపు

– ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాంకేతిక విద్యాశాఖలో 485 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హరిత కల్లెపు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 228 మంది కాంట్రాక్టు ప్రాతిపది కన, 257 మంది ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని ఈ ఏడాదిపాటు ఏప్రిల్‌ ఒకటి నుంచి మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Spread the love