Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం

- Advertisement -

– కవిత మాటలు.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు
– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
నవతెలంగాణ-శంషాబాద్‌

‘నా 20 ఏండ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేనేమిటో.. నా క్యారెక్టర్‌ ఏంటో ప్రజలకు తెలుసు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్న’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. లండన్‌ నుంచి శనివారం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న హరీశ్‌రావుకు అభిమానులు, పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల హరీశ్‌రావుపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కవిత ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలియదని అన్నారు. ఆమె మాట్లాడిన మాటలపై కౌంటర్‌ ఇవ్వదల్చుకోలేదని, విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్‌ సీఎంగా రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల తరఫున పోరాడి పార్టీని అధికారంలోకి తెస్తామని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad