Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీ రాజ్ పారిశుద్ధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad