- Advertisement -
– రేపు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండల పరిధిలోని 7 ఎంపీటీసీల వారిగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలను ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ శనివారం విడుదల చేశారు. సెప్టెంబర్ 6,2025 నాటికి మొత్తం 21537 మంది ఓటర్లు నమోదు అయ్యరు. వీరిలో పురుషులు 10501, మహిళలు11035,ఇతరులు 01 గా ఉన్నారు.కొలనుపాక-1 ఓటర్లు 3053, కొలనుపాక-2 ఓటర్లు 3385 మంది, రాఘవపురం 2519 మంది, టంగుటూరు 3483, శారాజీపేట 2606 మంది, కొల్లూరు 3441 మంది,గొలనుకొండ 3050 మంది ఓటర్లు ఉన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించ నున్నట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -