– వ్యాయామ ఉపాధ్యాయుడిని సత్కరించిన విద్యార్థులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న సంజీవ్ ను పాఠశాలకు చెందిన విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన మండల అంతర్ పాఠశాలల క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్ ను విద్యార్థులు సత్కరించి ఆయనపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు యెనుగందుల సౌమిత్, శాశ్వంత్ మాట్లాడుతూ తమ వ్యాయమ గురువు ప్రోత్సాహం వల్లే క్రీడలపై మక్కువ పెంచుకొని, రాణించడం ద్వారా పాఠశాల నుండి జాతీయ స్థాయిలో ఆడగలిగామని విద్యార్థులు తెలిపారు. జాతీయ స్థాయి హ్యాండ్ బాల్, ఫిఫ్టీ బాల్ జూనియర్ అండర్-19 క్రికెట్ పోటీల్లో తమను ఆడేలా తయారు చేయడంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్ చేసిన కృషి, అందించిన ప్రోత్సాహం మరువలేనిదని విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
గురువు ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES