క్రీడా పోటీలకు సర్వం సిద్ధం- ఎంఈవో ఆంధ్రయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ప్రారంభమవుతాయని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలకు క్రీడల కన్వీనర్ గా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేష్, కో ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్థానిక పాఠశాల పిఈటి రాజేందర్ వ్యవహరిస్తారని ఎంఈఓ ఆంధ్రయ్య ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మార్చ్ ఫాస్ట్ తో ఈ మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలో క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రేపటి నుండి మండల అంతర్ పాఠశాల క్రీడలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES